కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం నాడు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ లీటర్‌పై 17పైసలు, డీజిల్ లీటర్‌పై 18 పైసలు తగ్గింది. దాంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105 ఉండగా డీజిల్ ధర రూ.96.66కు తగ్గింది. కాగా పెట్రోల్ రేట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా పెరగటానికి కారణం బీజేపీ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం గతంలో కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్నయాల వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని ఇప్పట్లో ధరలను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఏది ఏమయినా ఇంధన ధరలు పెరగటంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై కూడా పడింది. దాంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వార్త కూడా చదవండి: పెరిగిన బంగారం ధరలు.. బంగారం బాటలోనే వెండి