విరామం లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కరోనా సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.91.53, డీజిల్ ధర రూ.82.06కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.97.86, డీజిల్ ధర రూ.89.17గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.93.38, డీజిల్ ధర రూ.86.96కి పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ లీటరుకు రూ.91.66, డీజిల్ రూ.89.17కి చేరింది.