పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయల్ ధరలు భారీగా పెరిగి ఆ తర్వాత శాంతించాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా పయనించడంతో బ్రెంట్ 112 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ 109డాలర్లుకు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఎన్నికలు కారణంగా గత కొంతకాలంగా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) చమురు ధరలుకు సంబంధించి గురువార కొత్త ధరలను విడుదల చేసింది. అయితే వీటిలో ఎటువంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే గత మూడునెలలకుపైగా భారత్‌లో ఆ ధరల్లో మార్పులేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడటంతో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉంది.
గత ఏడాది కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. మోడీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం తరహాలోనే ధరలు తగ్గించాయి. ఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఢిల్లిలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో 94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..