రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పై హైకోర్టులో మరో కేసు దాఖలైంది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని మాజీ కార్పొరేటర్, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
హైడ్రా ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్, హైడ్రాకు విస్తృత అధికారాలు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ వాదించారు. హైడ్రా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.