Sunday, November 24, 2024

Perth Test – కింగ్ కోహ్లీ మెరుపు సెంచ‌రీ – రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, స్పోర్ట్స్ డెస్క్‌:టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసీస్ టూర్‌లో స‌రికొత్త రికార్డు కొట్టేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ తన మార్క్‌ క్లాస్ చూపించాడు. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్‌ను మంత్రదండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడేశాడు. సెంచరీ చేసి రికార్డును సృష్టించాడు.

పెర్త్ టెస్ట్‌లో కొట్టిన తాజా సెంచరీతో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ సరసన కోహ్లీ నిలిచాడు. కంగారూ గడ్డ మీద అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆసియా బ్యాటర్ల లిస్ట్‌లో విరాట్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ (13 హాఫ్ సెంచరీలు) టాప్‌లో ఉన్నాడు. తాజా హాఫ్ సెంచరీ ఆస్ట్రేలియా గడ్డ మీద విరాట్‌కు 11వది కావడం విశేషం. ఇదే లిస్టులో రెండో స్థానంలో ఉన్న పాక్ దిగ్గజం జహీర్ అబ్బాస్ (11 అర్ధ శతకాలు)ను దాటేసి రెండో స్థానంలోకి కోహ్లీ వచ్చేశాడు.

కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో హాఫ్ సెంచరీల సచిన్ రికార్డును దాటేయడం పక్కాగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును అధిగ‌మించ‌డం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ప్రస్తుతం 6 వికెట్లకు 487 పరుగులు చేసింది. య‌శ‌స్వీ జైశ్వాల్ (161), కేఎల్ రాహుల్ (77), దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (25), పంత్ (1), ధ్రువ్ జురేల్ (1), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (29) కోహ్లీ (100 నాటౌట్), నితీష్‌కుమార్‌రెడ్డి 38 నాటౌట్‌గా ఉన్నారు. భారత జట్టు 533 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారీ టార్గెట్ కొట్టిన టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక‌.. 534 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నాథన్ పరుగులు ఏమి చేయకుండానే బమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. నైట్ వాచ్ మన్ గా వచ్చిన పాట్ కమిన్స్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement