స్కై వాచర్లకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది నాసా. పెర్సీడ్ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టు చెబుతోంది. ఇది జులై, ఆగస్టు నెలల మధ్య ఏర్పడుతుందని చెబుతున్నారు స్పేస్ సైంటిస్టులు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్ లైట్ షోగా ఇది ఉంటుందని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం భూమి జులై 17 నుంచి ఆగస్టు 24 తేదీల మధ్య కామెట్ స్విఫ్ట్ టటిల్ (Comet Swift-Tuttle ) మార్గంలో వెళ్తుంది. ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు ఆగస్టు 11, 12 తేదీల వరకు ఇట్లాంటి పెర్సీడ్ ఉల్కాపాతం కనిపించే అవకాశాలున్నాయి. అయితే.. అమెరికన్ మెటోర్ సొసైటీ (AMS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఆగస్ట్ 11-12 తేదీల్లో అత్యధిక సంఖ్యలో ఉల్కలను చూసే అవకాశం అమెరికన్ ప్రజలకు దక్కబోతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement