Friday, November 22, 2024

ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు.. ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసిన డీజీసీఎ

త్వరలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు రయ్‌మంటూ ఎగరనున్నాయి. పౌరవిమానయాన రంగంలోకి అడుగుపెట్టిన ఆకాశ ఎయిర్‌ సేవలు ఈనెలాఖరులోగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు అవసరమైన ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ (ఎయిర్‌లైన్‌ లైసెన్స్‌)ను గురువారం డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ యేవియేషన్‌ డీజీసీఎ మంజూరు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రాకేష్‌ ఝున్‌ ఝన్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు దేశీయంగా సేవలందించే ఎనిమిదవ సంస్థ.

డీజీసీఎ నుంచి తమకు ఎయిర్‌లైన్‌ లైసెన్స్‌ గురువారం మంజూరైందని, త్వరలో తమ దేశీయ వాణిజ్య సేవలు ప్రారంభించబోతున్నామని ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. 737 మాక్స్‌ రకానికి చెందిన 72విమానాలను సరఫరా చేయాలని గత నవంబర్‌లో బోయింగ్‌ను ఆకాశ ఎయిర్‌లైన్స్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ విమానాల్లో 737-8, 737-8-200 రకాలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement