హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎస్సై. కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. గ్రూప్ 2,3,4 పరీక్షలకు కూడా పేద విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు.. యువత పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వం అందించే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్ నుంచి 1048 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 స్టడీ సర్కిళ్లలో పోలీసు ఉద్యోగాల కోసం 2,980 మంది శిక్షణ పొందారని తెలిపారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ
Advertisement
తాజా వార్తలు
Advertisement