Friday, October 18, 2024

ఆర్ నారాయ‌ణ మూర్తి ఇంట విషాదం – త‌ల్లి రెడ్డి చిట్టెమ్మ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు..ద‌ర్శ‌క నిర్మాత ..పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి ఇంట విషాదం నెల‌కొంది. ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం కాగా.. వారిలో మూడో కుమారుడు ఆర్‌ నారాయణమూర్తి. చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె వ‌య‌సు 93సంవ‌త్స‌రాలు.రేపు ఉదయం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement