Friday, November 22, 2024

బీజేపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల జీవ‌నం విచ్చిన్నం : ఎంపీ మాలోత్ క‌విత‌

  • పెరిగిన పేద‌రికం, న‌లుగుతున్న స‌గ‌టు మ‌నిషి
  • తొమ్మిదేళ్ల‌లో 13సార్లు పెరిగిన వంట గ్యాస్ ధ‌ర‌
  • బీజేపీ హ‌ఠావో దేశ్‌కో బ‌బావో..
    మ‌రిపెడ, మార్చి 3 (ప్ర‌భ న్యూస్‌): తొమ్మిదేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశంలో ఎటుచూసిన పేద‌రికం పెరిగిపోయింది.. స‌గ‌టు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల జీవ‌నం విచ్ఛిన్నం అవుతున్నాయ‌ని, భార‌త దేశ ప్ర‌జ‌ల‌ను పీడీస్తూ వారిని ఆర్థికంగా కుదేలు చేస్తూ దేశంలో బీజేపీ నియంతృత్వ పాల‌న కొన‌సాగిస్తుంద‌ని బీఆర్ఎస్ మ‌హబూబాబాద్ జిల్లా అధ్య‌క్షురాలు, ఎంపీ మాలోత్ క‌విత మోదీ ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ ప్ర‌భుత్వం పెంచిన వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని ఆమె శుక్ర‌వారం మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల కేంద్రంలో జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ గుడిపూడి న‌వీన్ రావు, యువ‌నేత డీఎస్ ర‌విచంద్ర‌, మ‌హిళ‌లు, నేత‌ల‌తో క‌లిసి రాస్తారోకో, వంట‌వార్పు, ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ క‌విత‌ మాట్లాడుతూ ఓ ప‌క్క పెరిగిన చ‌మురు, వంట‌నూనె, నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు కుదేలు అవుతుంటే.. మ‌ళ్లా వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ ప్ర‌జ‌లపై మ‌రింత ఆర్థిక భారం వేయ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న‌ ధ‌ర‌లతో వంటింట్లో మ‌ళ్లి క‌ట్టెల పొయ్యి పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని, మ‌హిళ‌లు అనారోగ్యాల బారిన ప‌డి ఇబ్బంది ప‌డేలా బీజేపీ ప్ర‌భుత్వం పాలిస్తుంద‌న్నారు. గ‌తంలో ఏప్ర‌భుత్వాలు కూడా పెంచ‌ని విధంగా 9ఏళ్ల కాలంలో 13మార్లు వంట గ్యాస్ ధ‌ర పెంచిన అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం బీజేపీ అన్నారు. 2014లో రూ.490 ఉన్న వంట గ్యాస్ ధ‌ర నేడు రూ.1150 స‌గ‌టున‌ 178శాతంపెరిగింద‌ని, తొలుత స‌బ్సిడి ఇచ్చి అనంత‌రం క‌ట్ట‌లేమంటూ పూర్తి ప్ర‌జ‌ల‌పై భారం మోపింద‌ని విమ‌ర్శించారు.

    బీజేపీ ప్ర‌భుత్వం అదాని, అంబాని లాంటి కార్పొరేట్ శ‌క్తులకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంకురుణాల‌ను జాలి చూపి మాఫీ చేస్తుంద‌ని, కానీ నేడు పెరిగిన ధ‌ర‌ల‌తో కుదేల‌వుతున్న ప్ర‌జ‌ల‌పై మాత్రం క‌నిక‌రం క‌ల‌గ‌టం లేదా అని ప్ర‌శ్నించారు. ఆనాడు రూ.11పెంచితే బీజేపీ మహిళా మోర్చ దేశ నాయ‌కురాలు స్మృతి ఈరాని దేశ వ్యాప్తంగా మ‌హిల‌తో ధ‌ర్నాచేసింది.. మ‌రి నేడు మోదీ పాల‌న‌లో రూ.800పైగా ధ‌ర పెంచితే క‌న‌బ‌డ‌టంలేదా అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ప్ర‌జ‌లు, మ‌హిళ‌ల దీన స్థితి ఈ బీజేపీ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డంలేదా.. లేక పీడించి పాలించాలి అన్న నినాదంతో ఈ ప్ర‌భుత్వం పాలిస్తుందా అన్నారు. కేవ‌లం ఎన్నికల స‌మ‌యంలో కొండంత పెంచిన ధ‌ర‌ల‌ను పిస‌రంత త‌గ్గించి, మ‌ళ్లి ఎన్నిక‌లు ముగియ‌గానే ఉన్న‌దాని క‌న్నా అధికంగా పెంచటం మోదికి ప‌రిపాటిగా మారింద‌న్నారు. రెండు నెల‌ల క్రితం నాగాలాండ్‌, మేఘాల‌య‌, త్రిపుర ఎన్నిక‌లు రాగానే ధ‌ర‌లు పాక్షికంగా త‌గ్గించార‌ని.. ఎన్నిక‌లు ముగియ‌గానే మ‌ళ్లీ వంట‌నూనే, వంట గ్యాస్‌, చ‌మురు ధ‌ర‌లు అమాంతం పెంచార‌న్నారు. అంటే ఈ ప్ర‌భుత్వం పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని, కార్పొరేట్ శ‌క్తుల‌కు కొమ్ము కాస్తూ పేద ప్ర‌జ‌ల జీవ‌నంతో ఆట‌లాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విధంగానే దేశంలో ధ‌ర‌లు కొన‌సాగితే దేశ ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టించే రోజులు వ‌స్తాయ‌ని, బిజేపీని రానున్న రోజుల్లో ప్ర‌జ‌లంతా క‌లిసి గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ధ‌రాఘాతంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల‌కు క‌న‌బ‌డ‌టం లేదా అని ప్ర‌శ్నించారు. నేడు బీజేపీ ఎజెండా ప్ర‌జ‌ల‌ను పీడించూ.. దేశాన్ని పాలించు అన్న విధంగా కొన‌సాగుతుంద‌న్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భుత్వానికి దేశ ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ జిల్లా నాయ‌కులు కుడితి మ‌హేంద‌ర్ రెడ్డి, ముత్యం వెంక‌న్న‌, జిల్లా కో ఆప్ష‌న్ యాకుబ్ పాషా, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జ‌డ్పీటీసీ తేజావ‌త్ శార‌దా ర‌వీంద‌ర్‌, మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ గుగులోత్ సిందూర ర‌వి, వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, స‌ర్పంచ్‌ల ఫోరం అధ్య‌క్షుడు తాళ్ల‌ప‌ళ్లి శ్రీ‌నివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్య‌క్షుడు ర‌ఘు, బీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అద్య‌క్షుడు ఉప్ప‌ల నాగేశ్వ‌ర రావు, జిల్లా రైతు స‌మ‌న్వయ స‌మితి స‌భ్యులు కాలు నాయ‌క్‌, బీఆర్ఎస్ నాయ‌కులు అంబ‌టి వెంక‌ట్ రెడ్డి, శ్రీ‌పాల్ రెడ్డి, ముఖేష్‌, రాంపెళ్లి ర‌వి, అజ్మీర రెడ్డి, నారాయ‌ణ‌, దుస్స న‌ర్స‌య్య‌, మాచ‌ర్ల భ‌ద్ర‌య్య‌, గంధ‌సిరి లింగ‌మూర్తి, ల‌తీఫ్‌, యాకుబ్ జానీ, మ‌హ్మ‌ద్ అఫ్జ‌ల్‌, యాకుబ్ పాష్‌, రేఖ వెంక‌టేశ్వ‌ర్లు, రెడ్యా, భాస్క‌ర్‌, కౌన్సిల‌ర్లు ఊరుగొండ శ్రీ‌ను, బానోత్ కిష‌న్‌, శ్రీ‌ను, ప‌ర‌శురాములు, హ‌తిరాం, బ‌య్య భిక్షం, కో ఆప్ష‌న్లు షేక్ మ‌క్సూద్‌, దేవ‌ర‌శెట్టి శ్రీ‌ల‌త ల‌క్ష్మినారాయ‌ణ, ఖైరున్ హుస్సేన్‌, స‌ర్పంచ్‌లు ఆనంద్‌, ప్ర‌భాక‌ర్‌, జ‌నార్ధ‌న్‌, ఎంపీటీసీ నారాయ‌ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement