దాదాపు 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్..ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా రాబోయే పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని ఆజాద్ వెల్లడించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో పలుసార్లు కేంద్రమంత్రిగా, 2005 నుంచి 2008 వరకు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగాను సేవలందించారు. ఇంతకు ముందు జమ్మూలో జరిగిన బహిరంగ సభలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీకి ఇంకా పేరు పెట్టలేదని, జమ్మూ క,శ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెట్టనున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, స్థానికులకు ఉపాధి తదితర అంశాలపై పార్టీ పోరాడుతుందని ఆజాద్ వెల్లడించారు.
పది రోజుల్లో కొత్త పార్టీ-జెండాని..పార్టీ పేరుని నిర్ణయించేది ప్రజలే-గులామ్ నబీ ఆజాద్
Advertisement
తాజా వార్తలు
Advertisement