తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఉదయం దట్టమైన మంచు పొగ మంచు కురుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ, ఏపీ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కుమ్రభీం అసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు విశాఖ జిల్లా లంబసింగి ప్రాంతాల్లో కూడా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.