కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్) ఆశావహులకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గరిష్ఠ వయో పరిమితి నిబంధనను తొలగించింది. గతంలో 25 ఏళ్లు దాటితే నీట్ కు అనర్హులుగా భావించేవారు. ఇప్పుడా నిబంధన ఎత్తివేస్తున్నట్టు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. తద్వారా అన్ని వయసుల వారికి నీట్ రాసే వెసులుబాటు కల్పించింది. కాగా, వయో పరిమితి నిబంధన తొలగించిన కారణంగా ఈ ఏడాది నీట్ కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో వైద్య కళాశాలల్లోనూ సీట్లకు విపరీతమైన పోటీ ఏర్పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital