Sunday, November 10, 2024

ఈ దేశాల్లో పుట్టిన వారు – ఆర్మీలో చేరాల్సిందే

ప‌లు దేశాల్లో పుట్టిన వారు త‌ప్ప‌నిస‌రిగా సైన్యంలో చేరి దేశ సేవ‌లు అందించాల్సిందేన‌ట‌. అయితే వారికి ప్ర‌భుత్వం త‌రుపు నుంచి నామ మాత్ర‌పు జీతం మాత్ర‌మే దక్కుతుంది. కొన్నేళ్ల పాటు సైన్యంలో ప‌ని చేసిన వారు బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌రువాత సాధార‌ణ పౌరులుగా జీవించాల్సి ఉంటుంది. రష్యన్ చట్టాల ప్ర‌కారం ఆ దేశంలో పుట్టిన 18 నుండి 27 సంవత్సరాల వయస్సు గల పురుషులకు 12 నెలల పాటు సైనిక సేవ తప్పనిసరి. ఇలా సైనిక సేవ చేసే వారిని హేజింగ్ అని పిలుస్తారు. అయితే వారి మ‌త పరమైన విశ్వాసాలు, న‌మ్మ‌కాలు సైనిక సేవకు విరుద్ధంగా ఉంటే సైనికేతర రూపమైన జాతీయ సేవను ఎంచుకోవడానికి రష్యన్ రాజ్యాంగం అనుమతిస్తుంది. ఎందులోనూ భాగస్వామ్యం కాక‌పోతే జరిమానా భ‌రించ‌డం లేదా జైలు శిక్ష ను అయినా అనుభించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ తో జ‌రుగుతున్న యుద్ధంలోనూ వీరిని ఉప‌యోగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా వీటి నుంచి త‌ప్పించుకునేందుకు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు గల చాలా మంది రష్యన్లు దేశం నుంచి పారిపోతున్నారని ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి.

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా గత 72 సంవత్సరాలుగా సాంకేతికంగా యుద్ధంలో ఉన్నాయి. శత్రుత్వం ఫలితంగా రెండు దేశాలు తమ సైన్యాన్ని బలపరిచాయి. ఉత్తర కొరియా ‘సోంగున్’ అని కూడా పిలువబడే మిలిటరీ-ఫస్ట్ పాలసీని అనుసరిస్తుంది, దీని కింద అన్ని వనరులకు మొదట సైన్యం ప్రాధాన్యత ఇవ్సాలి ఉంటుంది. సాధారణంగా ఇక్క‌డ 17-18 సంవత్సరాల వయస్సులో సైనిక సేవలో చేరాల్సి ఉంటుంది. గ‌తంలో పురుషులు అయితే 13 సంవ‌త్స‌రాలు, మ‌హిళ‌లు అయితే 10 సంవ‌త్స‌రాలు ఆర్మీలో సేవ‌లందించాలి. కానీ 2003 నుంచి దీనిని పురుషుల‌కు 10, మ‌హిళ‌లు 7 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గించారు. కాగా గతంలో మహిళలకు సైనిక సేవ స్వచ్ఛందంగా ఉండేది. అయితే 2015 నుంచి త‌ప్ప‌నిసరి చేశారు. ఇక ఇజ్రాయెల్,బ్రెజిల్,ఇరాన్,టర్కీ,క్యూబా,స్విట్జర్లాండ్,ఎరిత్రియా,స్వీడన్ లో జ‌న్మించిన వారు కూడా త‌ప్ప‌నిస‌రిగా ఆర్మీలో చేరాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement