విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు ఘోర పరాభవం ఎదురైంది. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదన్న కారణంతో ప్రజలు ఆయన్ను చుట్టుముట్టి ఘోరంగా అవమానించారు. జిల్లాలోని రామభద్రాపురం సమీపంలోని కొండకెంగువ గ్రామంలో జగనన్న ఇళ్ల శంకుస్థాపనకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో గ్రామంలో 50 మందికి పైగా అనర్హులకు ప్రాధాన్యం ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని బాధితులు గొడవకు దిగారు. పలు సమస్యలపై చర్చించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకే పట్టాలు ఇస్తారా అంటూ నిలదీశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని భారీ భద్రత మధ్య ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసే ప్రాంతానికి ఎమ్మెల్యేను తీసుకువెళ్లారు. కాగా న్యాయం చేయకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ మహిళలు, యువకులు ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో గ్రామస్తులు టెంట్లు, కుర్చీలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు.
ఇది కూడా చదవండి: ఇసుక పాలసీపై సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన RRR