Friday, November 22, 2024

పెండింగ్ చలానాలు ఈజీగా చెల్లించొచ్చు.. ఆన్‌లైన్‌ మనీ యాప్స్తో చాన్స్: ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానాలను చెల్లించకుండా ఉన్న వాహనదారులకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శుభవార్త తెలిపారు. పెండింగ్‌ చలానాల చెల్లింపులను ఆన్‌ లైన్‌ ద్వారా జరపాలని ట్రాఫిక్‌ జాయించ్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ చాలన్‌ సిస్టమ్‌ ద్వారా అన్ని పెండింగ్‌ చలన్‌లు చెల్లించాలన్నారు. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చన్నారు. లేకపోతే మీసేవ, ఈసేవలోనూ చెలించవచ్చని చెప్పారు. మార్చి 1 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ట్రాఫిక్‌ చలనాలపై రాయితీ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కారణముగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సానుకూల దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వ అనుమతితో పెండింగ్‌ చలానాలపై రాయితీని ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనలపై ఉన్న చలాన్‌లపై కేవంల 25 శాతం చెల్లించాలని, కార్లకున్న చలాన్‌లపై కేవలం 50 శాతం రాయితీ, నో మాస్క్‌ చలనాలన్న వారు కేవలం రూ. 100 చెల్లిస్తే సరిపోతుందన్నారు.

ఆటోలపై ఉన్న చలాన్‌లలో 25 శాతం చెల్లించాలన్నారు. తోపుడు బండ్లపై ఉన్న చలానాల మొత్తాలలో కేవలం 20 శాతం చెల్లించాలన్నారు. పేద వర్గాలకు వెసుల బాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 1.75 లక్షల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రూ. 500 కోట్ల వరకు జరిమానాలను చెల్లించాల్సి ఉందన్నారు. ఏ వాహనానికి ఎంత బకాయి ఉంది. రాయితీ పోగా ఎంత చెల్లించాల్సి ఉందన్న అంశాలన్నింటినీ తెలంగాణ ఈ చాలన్‌ వెబ్‌ సైట్‌ లో ప్రాసెస్‌ చేస్తుందన్నారు. నెల రోజుల వెెసులబాటులో చాలన్‌ కట్టకపోతే తగిన చర్యలు స్పెషల్‌ డ్రైవ్‌ పెడ్తామన్నారు.

ఇతర జిల్లాల ఆటోలకు అనుమతి లేదు..

వేరే జిల్లాలలో రిజిస్టర్‌ అయిన ఆటోలు హైదరాబాద్‌లో తిరిగేందుకు అనుమతి లేదని రంగనాథ్‌ స్పష్టం చేశారు. బయట జిల్లాలలో రిజిస్టర్‌ అయిన ఆటోలు హైదరాబాద్‌ రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్‌లో తిరగడం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో యూనియన్‌ల ప్రతినిధులు విన్నవించారని, వారి వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement