యాపిల్ కంపెనీకి సప్లయిర్‌గా ఉన్న తైవాన్ కు చెందిన పెగట్రాన్ కార్పోరేషన్ ఇండియాలో రెండో ప్లాంట్ ప్రారంభించేందుకు చర్చలు జరుపుతోంది. చైనాకు బటయ ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇండియాలో యాపిల్ ఉత్పత్తులను పెంచాలని భావిస్తోంది. చైన్నయ్‌కి సమీపంలో ఆరు నెలల క్రితమే 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పెగట్రాన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఇక్కడే రెండో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ప్లాంట్‌లో ఐ ఫోన్‌ను అసెంబుల్ చేయనున్నారు.
యాపిల్ కంపెనీనికి ప్రస్తుతం ఇండియా ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఇండియా నుంచి 9 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేశారు. మొత్తం పెగట్రాన్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఐ ఫోన్లలో ఇండియా 10 శాతం వాటా కలిగి ఉంది. 2017 నుంచి మన దేశంలో పెగట్రాన్ కంపెనీ వెస్ట్రన్, ఫాక్స్‌కాన్ ద్వారా ఐ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది.
మొబైల్స్ మార్కెట్‌లో ప్రపంచంలోనే చైనా తరువాత ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇండియాలో ఐ ఫోన్ల అసెంబ్లింగ్‌తో పాటు, ఐప్యాడ్ ట్యాబ్స్, ఎయిర్‌పాండ్స్‌ను ఉత్పత్తి చేయనుంది. కర్నాటకలో ఫాక్స్‌కాన్ 968 మిలియన్ డాలర్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోనూ ఐ ప్యాడ్స్, ఎయిర్‌పాండ్స్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది.