Monday, November 11, 2024

నేడు సుప్రీం కోర్టులో విచారణకు పెగాసస్‌..

దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం లేపిన పెగాసస్ పై నేడు సుప్రీం కర్టు విచారణ చేపట్టనుంది. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్‌ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది.. ఈ వ్యవహారంపై గత గురవారం విచారణ సందర్భంగా పిటిషనర్లను తమ పిటిషన్‌ కాపీలను ప్రభుత్వానికి అందజేయాలని ధర్మసనం సూచించగా… ఈ రోజు ప్రభుత్వ వాదనలు జరగనున్నాయి.

మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం కాకుండా, మరింత లోతుగా అధ్యయనం చేసే వనరులు, సామర్థ్యం ఉన్న పిటిషనర్లు ఇతరత్రా సమాచారం ఎందుకు చేయలేకపోయారంటూ.. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.. క్రిమినల్ కేసును ఎందుకు నమోదు చేయలేదు అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఇలాంటి నిఘా చర్యలు వ్యక్తిగత గోప్యత, స్వేఛ్చ, స్వాతంత్ర్యాలకు, గణతంత్ర దేశ సార్వభౌమత్వానికి తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, తక్షణమే దర్యాప్తుకు ఆదేశాలు జారీచేయాలని పిటీషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్… మరి ఇవాళ విచారణ ఏ రకంగా సాగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: మరోసారి తగ్గిన బంగారం ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement