భోపాల్ : గిరిజన కార్మికుడిపై బిజెపి నేత ఒకరు మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. అలాంటి పని చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ లు వినపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు బాధ్యుడైన బిజెపి నేత
ప్రవేశ్ శుక్లా ఇంటిని నేడు బుల్ డోజర్ తో కూల్చివేశారు..మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గిరిజన కూలీపై మూత్రం పోసిన వీడియో వైరల్ కావడంతో నిందితుడు శుక్లాను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆతడి ఇళ్లు అక్రమంగా నిర్మించారని గుర్తించి బుల్ డోజర్ ను తీసుకొచ్చి క్షణాలలో కూల్చివేశారు..
కాగా,నిందితుడు అమానవీయ చర్యకు పాల్పడ్డాడని, కఠిన శిక్ష కూడా అతడికి తక్కువేనని అతడికి విధించే శిక్ష ప్రతిఒక్కరికీ గుణపాఠంలా ఉండాలని, అతడిని విడిచిపెట్టేది లేదని తాను అధికారులకు ఆదేశాలు జారీ చేశానని సీఎం పేర్కొన్నారు. గిరిజన కూలీని అవమానించిన నిందితుడి చర్య అత్యంత హేయమని, మానవత్వానికి మాయని మచ్చని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు.