Monday, November 18, 2024

వైభవంగా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పెద్దపట్నం..

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామివారి కల్యాణోత్సవాన్ని స్తుతిస్తూ పెద్దపట్నం కార్యక్రమం రాత్రి 12 గంటలకు ప్రారంభించి.. వేకువఝాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నంపైకి దాటారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా సంఖ్యలో తరలిరావడంతో ఉత్సవాల్లో ఎలాంటి అవంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement