ఉప ముఖ్యమంత్రి ఎదుట విద్యార్థుల కంటతడి
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంఘటన తీరుపై ఆరా
పెద్దాపూర్ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి పొన్నంతో కలిసి భేటీ
ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి కరీంనగర్ : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థులు మృతి చెందిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇటీవల మృతి చెందిన విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈసంఘటనపై పూర్తి వివరాలు పంపించాలని గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిని విచారించారు.
చలించిపోయిన మంత్రులు
గురుకుల పాఠశాల విద్యార్థుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చలించిపోయారు. ప్రతినెలా? లేదా? ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో డ్యూటీ నర్స్ సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు కంట తడిపెట్టారు. తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకున్నామని చెప్పారు. వారిని మంత్రులు ఓదార్చారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం , సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.