Wednesday, December 18, 2024

TG | తాజ్ హోట‌ల్లో పీసీసీ చీఫ్ విందు !

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు (బుధవారం) కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్‌ లో విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా… టీపీసీసీ చీఫ్‌గా తాను బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన విందు ఇస్తున్నారు.

ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement