Monday, November 25, 2024

అడ్డు పడితే ప్రపంచకప్‌లో ఆడబోం.. పిసీబీ చైర్మన్‌ రమీజ్‌

తమ దేశంలో 2023 ఆసియాకప్‌ నిర్వహించకుండా అడ్డు పడితే వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడబోమని పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రజా స్పష్టం చేశాడు. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా భారత పర్యటనకు పాక్‌ను ప్రభుత్వం అనుమతించకపోతే మేము స్పందించాల్సి ఉంది అని వ్యాఖ్యానించాడు. టీ 20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ , ఇండియా మ్యాచ్‌ చూశారుగా 90 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. క్రికెట్‌లో బ్యాటు, బంతి మాత్రమే మాట్లాడుతాయి అని రమీజ్‌ తెలిపాడు. టీ 20 గ్రూప్‌ మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. అందుకు ఫిఫా వరల్డ్‌ కప్‌ను ఉదాహరణగా చెప్పాడు.

అంతే కాదు రాజకీయాలతో సంబంధం లేకుండా భారత్‌, పాకిస్థాన్‌ పర్యటనకు రావాలని , టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాలని రమీజ్‌ స్పష్టం చేశాడు. అందుకు ఫిఫా వరల్డ్‌ కప్‌ను ఉదాహరణగా చెప్పాడు. ఫిఫావరల్డ్‌ కప్‌లో ఇరాన్‌ , అమెరికా తలపడుతున్నాయి. ఇరాన్‌ మహిళల హక్కులు, హిజాబ్‌తో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఆ జట్టు ఫుట్‌బాల్‌ ఆడుతోంది. ఆట వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

2023 ఆసియా టోర్నీకి పాక్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత జట్టు ఆసియాకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ వెళుతుందా ? లేదా? అనే అనుమానాలకు బీసీసీఐ కార్యదర్శి జైషా తెరదించాడు. భారత్‌ పాక్‌ గడ్డపై కాలు పె ట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. అంతే కాదు అవసరమైతే ఆసియాకప్‌ వేదికను మారుస్తామని జైషా వెల్లడించాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌, మాజీలు జైషా నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఒకవేళ అదే జరిగితే వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ను బాయ్‌ కాట్‌ చేస్తామని పాక్‌ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement