ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. దాదాపు నిర్జీవంగా ఉన్న ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకునెందుకు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్, బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), రజత్ పాటిదార్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.
పంజాబ్ కింగ్స్ :
జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (c), ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), రిలీ రోసౌ, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప.
ప్రస్తుతం రెండు టీమ్‌లు లు ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. ఆర్సీబీ ఏడో ప్లేస్‌లో, పంజాబ్ ఎనిమిదో ప్లేస్‌లో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి.