ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ విజృంభించింది. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్ బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ( 47 బంతుల్లో 92) తో చెలరేగాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రజత్ పాటిదార్ ( 23 బంతుల్లో 55) తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 46) తో కలిసి బెంగళూరుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. ఆఖర్లో దినేష్ కార్తీక్ (7 బంతుల్లో 18) బౌండరీలు బాది పెవిలియన్ చేరాడు.
ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా… విధ్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీశాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.