ఐపీఎల్లో భాగంగా నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.
జట్ల వివరాలు
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ కింగ్స్ :
ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (wk), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, సామ్ కర్రాన్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, అశుతోష్ శర్మ.
ఇరు జట్లకూ కీలకం..
అయితే ఈ సీజన్లో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలో, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి. ఇక నుంచి ముంబై, పంజాబ్ ఇద్దరికీ ప్రతి మ్యాచ్ కీలకమే.