స్వల్ప ఛేదనలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేసారు. దర్మశాల వేదికగా నేడు (ఆదివారం) పంజాబ్‌తో జరగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై పంజాబ్ ముందు 168 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అయితే స్వల్ప ఛేదనలో పంజాబ్ కింగ్స్ తడబడింది. చెన్నై బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసి 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ విజంతో సీఎస్‌కే జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఓ అడుగు ముందుకేసి పాయింట్స్ టేబుల్‌లో మూడవ స్థానానికి చేరుకుంది.
పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (7), రీలే రస్సో(0)లను యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే ఒకే ఓవర్లో బౌల్డ్ చేశాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(30), శశాంక్ సింగ్(27)లు పరుగులకే వెనుదిరిగారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమవ్వడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా… తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.