Friday, November 22, 2024

75 శాతం తగ్గిన పేటీఎం షేరు విలువ.. ప్రపంచంలో ఇదే అత్యంత వరెస్ట్‌ ఐపీఓ

ఈ దశాబ్దంలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌లో అత్యంత పేలవమైన పనితీరును కనబరిచిన వాటిలో పేటీఎం షేరు ఉంది. ఐపీఓ ఆఫర్‌ ధరతో పోల్చితే పేటీఎం షేరు ధర 75 శాతం పతనమైంది. పేటీఎం ఐపీఓ ద్వారా 18,300 కోట్లు సమీకరించింది. పేటీఎం మాతృ సంస్థ 97 కమ్యూనికేషన్స్‌ ఐపీఓ లిస్టయిన నాటి నుంచే నష్టాల్లో ఉంది. పేటీఎం షేరు జారీ ధర 2150 రూపాయలతో పోల్చితే 9 శాతం డిస్కౌంట్‌తో 1950 వద్ద నమోదైంది.

పేటీఎం కంటే ముందు 2012లో స్పేయిన్‌ బ్యాంక్‌ షేరు విలువ ఆఫర్‌ ధరతో పోల్చితే 82 శాతం పతనమైంది. పేటీఎం షేర్లు స్టాక్‌మార్కెట్‌లో లిస్టయి సంవత్సరం పూర్తయింది. లిస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకు పేటీఎం షేరు ధర సరాసరి 75 శాతం పతనమైంది. నవంబర్‌లో 30 ఇండెక్స్‌ షేర్లలో పేటీఎం షేరు 79 శాతం పతనమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement