Tuesday, November 26, 2024

Paytm Karo | పేటీఎంకు పెరగనున్న కస్టమర్లు.. సౌండ్‌బాక్స్‌తో భారీగా బిజినెస్‌

ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం సౌండ్‌ బాక్స్‌ డివైజ్‌తో తన కస్టమర్ల సంఖ్యను అదనంగా 15 మిలియన్ల వరకు పెంచుకుంటుందని తెలిపింది. సౌండ్‌ బ్యాంక్‌ డివైజ్‌ మూలంగా రానున్న రెండు మూడు సంవత్సరాల్లో కస్టమర్ల సంఖ్య 15 మిలియన్ల వరకు పెరుగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది. ఈ సెగ్మెంట్‌లో ఇండియాలో సౌండ్‌ బాక్స్‌లను మొదట ప్రవేశపెట్టిన పేటీఎంకు కస్టమర్లు పెంచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

పేటీఎం సౌండ్‌ బాక్స్‌లను ప్రధానంగా మార్కెట్‌లో 25 మిలియన్లు మీడియం ఎస్‌ఎంఈల మార్కెట్‌లో, చిన్న రిటైలర్స్‌ మార్కెట్‌లో 15-17 మిలియన్ల వరకు ఉంటుందని తెలిపింది. పేటీఎం ఇప్పటి వరకు 6.5 మిలియన్‌ సౌండ్‌ బాక్స్‌లను డెవలప్‌ చేసింది. ముందుగా ఈ పేమెంట్‌ సౌండ్‌ బాక్స్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, ఫోన్‌పే, భారత్‌ పే కూడా భారీ ఎత్తున వీటిని మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. ఫోన్‌పే 2-2.2 మిలియన్‌ డివైజ్‌లను , భారత్‌ పే 9 లక్షల సౌండ్‌ బాక్స్‌లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ సెగ్మెంట్‌లో రెండు మూడు సంస్థలకు తగిన నంత మార్కెట్‌ అవకాశాలు ఉన్నాయని అమెరికన్‌ బ్యాంక్‌ తెలిపింది.

- Advertisement -

సౌండ్‌ బక్స్‌లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు పేటీఎం భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఈ సౌండ్‌ బాక్స్‌లను వినియోగిస్తున్న వారు నెలకు 100రూపాయల నిర్వాహణ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఈ రంగంలో రానున్న రెండు మూడు సంవత్సరాల్లో 4-5 మిలియన్‌ సౌండ్‌ బాక్స్‌లు పేటీఎం ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా కొత్త కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది. పేటీఎం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సౌండ్‌ బాక్స్‌ల కోసం 712 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇందు కోసం 504 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది.

ఈ సౌండ్‌ బాక్స్‌లో స్పీకర్‌ ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసిన తరువాత కస్టమర్‌ చెల్లించిన మొత్తాన్ని స్పీకర్‌లో తెలియచేస్తుంది. దీని వల్ల వ్యాపారులు ప్రతిసారి తమ ఫోన్లను చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చెల్లింపుల నిర్ధారణకు ఇది బాగా ఉపయోగపడుతుండటంతో వ్యాపారులు ఈ సౌండ్‌బాక్స్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement