Friday, November 22, 2024

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డేటా లీక్‌.. బ్లూమ్‌బర్గ్‌ ఆరోపణలు, ఖండించిన పేటీఎం

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్‌ చేశారని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు విదేశాల్లోని సర్వర్‌లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిందని బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పేర్కొంది. చైనా సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్బీఐ తనిఖీల్లో గుర్తించాయని నివేదికలో వెల్లడించింది. అందుకే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌బ్యాంక్‌ నిషేధం విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ అభిప్రాయపడింది. కాగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, జాక్‌మాస్‌ యాంట్‌ గ్రూప్‌ కో పేటీఎంలో వాటాలను కలిగి ఉన్నాయి.

అయితే బ్లూమ్‌బర్గ్‌ నివేదికను పేటీఎం తీవ్రంగా ఖండించింది. తప్పుడు ఆరోపణలుగా పేర్కొంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని తెలిపింది. డేటా స్థానికీకరణపై ఆర్బీఐ ఆదేశాలకు పేటీఎం కట్టుబడి ఉందని వెల్లడించింది. బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని తెలిపింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పూర్తి స్వదేశీ బ్యాంకుగా ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపింది. కాగా పేటీఎం షేర్లు సోమవారం 13.3శాతం పతనమయ్యాయి. 2016 ఆగస్టులో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. 2017 మేలో నొయిడా శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement