దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ కోసం ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి UPI యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారానే అద్దె, బిల్లు చెల్లింపు, గ్యాస్, ఫ్లైట్, బీమా, మొబైల్ రీఛార్జ్ మొదలైన అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తుంటారు. అయితే, తాజాగా UPI యాప్ Paytm, Google Pay కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాయి. ఇక నుంచి ఈ యాప్‌ల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ప్లాట్‌ఫారమ్ కన్వీనియన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అంటే మొబైల్ రీఛార్జ్‌ల కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌లు రుసుమును వసూలు చేయనున్నాయి. మొబైల్ రీఛార్జ్‌పై Google Pay రూ.3 వరకు వసూలు చేయగా, రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్‌లపై Paytm రూ.1 వసూలు చేస్తుంది. ఇక ఇప్పటికే ఫోన్ పేలో ఈ నిబందన ఉండగా.. Google Pay, Paytm కూడా అదే మార్గాన్ని అనుసరించడం ప్రారంభించాయి.