Sunday, November 24, 2024

Payments Due – పంచాయతీ బిల్లులు పక్కదారి పట్టించారు – సీతక్క

ములుగు – సర్పంచ్​లకు చెల్లించాల్సిన బిల్లులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క అన్నారు. దీంతో ఐదేళ్లుగా వారికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దీంతో సర్పంచ్ లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ములుగు పంచాయతీ పాలకవర్గం సభ్యులు శుక్రవారం మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్లను దారి మళ్లించిందని విమర్శించారు. దీంతో చాలా మంది సర్పంచ్ లు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారని తెలిపారు.

ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. అన్ని చెల్లింపులు జరిపామని అప్పటి ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు రికార్డులన్నీ పరిశీలిస్తే చాలా బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోందని అన్నారు. వాటిని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా అని సర్పంచ్ లు ఇంకా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇంకా నెల రోజులు గడిస్తే వారి పదవీ కాలం కూడా ముగుస్తుందని తెలిపారు. అందుకే వారి సమస్యను కేబినేట్ మీటింగ్ లో చర్చిస్తామని, ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement