Sunday, November 24, 2024

ట్విటర్‌ వార్తలకు పేమెంట్‌..

ట్విటర్‌లో వార్తలు చదవాలనుకుంటే ఇక నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌లో వార్తలు చదివేవారి నుంచి డబ్బులు వసూలు చేసుకునేందుకు ఆయా వార్తా సంస్థలకు ఆయన అనుమతి ఇచ్చారు. ఒక్కో ఆర్టికల్‌కు ధర నిర్ణయించుకుని వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. ఈ కొత్త ఫీచర్‌ను మే నెల నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మస్క్‌ తెలిపారు.

సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత బ్లూ టిక్‌ సేవలు పొందుతున్న వారు మాత్రం వార్తల కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. దీని వల్ల మీడియా సంస్థలతో పాటు, యూజర్లు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ట్విటర్‌లో ఇక నుంచి మాతృత్వ, పితృత్వ సెలవులను 20 వారాల నుంచి 14 రోజులకు కుదించారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement