Friday, November 22, 2024

Anganwadi | వారికి త‌క్ష‌ణమే జీతాలు చెల్లించండి: హరీశ్‌రావు

ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని.. మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. జీతాలు అంద‌క ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, 7నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement