రాజ్య సభ మాజీ సభ్యుడు పవన్ కుమార్ వర్మ తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు.ఆయన గతంలో జనతాదళ్(యు)లో ఉండేవారు.పౌరసత్వం చట్టం సవరణ బిల్లను బీజేపీ తెచ్చినందుకు ఆ పార్టీతో జనతాదళ్(యు) తెగతెంపులు చేసుకోవాలని పట్టుపట్టారు.అందు కోసం జనతాదళ్(యు)ని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ అధ్యక్షురాలు,బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలోఈ విషయం తెలియజేశారు.తన పట్ల చూపిన అభిమానానికి ఆయన కృతజ్ఞత తెలిపారు.ప్రతిపక్షాలను సమైక్యపర్చడం ప్రస్తుత అవసరమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
2020లో వర్మ,ప్రశాంత్ కిషోర్‌లు జనతాదళ్ (యు)ని విమర్శించినందుకు ఆ పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు.కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో కటీఫ్ చేసుకున్నందుకు వర్మ మళ్ళీ జనతాదళ్( యు)లో చేరేందుకే తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి ఉండవచ్చు. అయితే,నితీశ్ కుమార్ ఇతర రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.