ఇటీవల కాలంలో సెంటిమెంట్ తో కూడిన చిన్న,పెద్ద సినిమాలు హిట్ కొడుతున్నాయి.. తమిళంలో సెంటిమెంట్ హిట్ మూవీ వినోదయం సిత్తం ను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశాడు ఆ మూవీ దర్శకుడు సముద్రఖని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్ తర్వాత తన మేనల్లుడు సాయి తేజ్ తో తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది.. ఎలాగుందో తెలుసుకుందాం రండి.
మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయి తేజ్) ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉన్నతోద్యోగి. తాను లేకపోతే ఆ కంపెనీనే లేదు అనుకునే మార్క్ ఇంట్లో తల్లితో పాటు తన ఇద్దరు చెల్లెళ్లు ఫారిన్లో ఉండే తమ్ముడు.. ఇలా అందరికీ తనే దిక్కు అనుకుంటాడు. అందరూ తన మాటే వినాలంటాడు. తాను లేకుండా వీళ్లెవ్వరికీ జీవితమే లేదనుకుంటాడు. వీరితో పాటు తన ప్రేయసికి కూడా టైం ఇవ్వకుండా బిజీ బిజీగా గడిపేస్తున్న మార్క్ ఒక కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడే అతడికి కాల దేవుడు (పవన్ కళ్యాణ్) పరిచయమవుతాడు. తాను లేకుంటే కుటుంబం కంపెనీ ఏమవుతుందో అని కంగారు పడే అతడికి మళ్లీ ఇంకో అవకాశం ఇస్తాడు కాల దేవుడు. 90 రోజుల రెండో జీవితం మొదలుపెట్టిన అతడికి తన ప్రపంచం కొత్తగా పరిచయం అవుతుంది. ఈ క్రమంలో అతను తెలుసుకున్న జీవిత సారం ఏంటన్నదే తెరమీద చూసి తెలుకోవాల్సిందే..
మరోసారి లైఫ్ వస్తే అనే కాన్సెప్ట్ కి, దేవుడిని జోడించి తీసిన ఈ మూవీ నవ్వించి,ఏడ్పించేస్తుంది.. బలమైన సెంటిమెంట్ ఉంటే ఈ మూవీ మరింత బాగుండేది అనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.. ఇక బ్రో’కి పవన్ కల్యాణే ప్రధాన ఆకర్షణ. చూడ్డానికి అతిథి పాత్రలా కనిపించినా . సినిమాలో మేజర్ పార్ట్ ఆ క్యారెక్టర్ ఉంటుంది. చేసింది దేవుడి పాత్రే అయినా తన ట్రేడ్ మార్క్ స్టైల్స్ తో కనిపించే ప్రతి సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటుంది. సాయి తేజ్ పెర్ఫామెన్స్ ఓకే. ‘బ్రో’ కథ కూడా యాక్సిడెంట్, సెకండ్ లైఫ్ నేపథ్యంలో సాగేదే కావడం వల్ల సాయి తేజ్ పాత్రతో కనెక్ట్ కాగలుగుతాం. హీరోయిన్ కేతిక శర్మ ,ప్రియ ప్రకాష్ వారియర్. ఊర్వశీ రౌతేలా, రోహిణి. వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధిలో నటించారు..
తమన్ బ్యాక్ గ్రౌండ్ బాగున్నా పాటలు ఆకట్టుకునే విధంగా లేవు.. త్రివిక్రమ్ డైలాగ్స్ థియేటర్ లో పేలాయి. కెమెరా పనితనం కుదిరింది.. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.. ఓవరాల్ గా ఈ మూవీ అందర్ని ఆకట్టుకునేలా ఉంది..పవన్ ఫ్యాన్స్ కి అయితే మరీ నచ్చేస్తోంది..