Saturday, June 29, 2024

AP | ఫ‌స్ట్ హీరోయిన్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే మొదటి సినిమా తర్వాత సుప్రియ సినిమాల నుంచి తప్పుకుంది. అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు చూసుకుంటూ.. నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించారు.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈరోజు (సోమవారం) విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో సుప్రియ కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కల్యాణ్‌కు సుప్రియ అభినందనలు తెలిపారు. ఆ తర్వాత పవన్‌తో కలిసి ఫోటోలు దిగింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement