ఇవాళ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు. టాలీవుడ్ హిరోలతో పాటు ఇతర సినీ పరిశ్రమల నుంచి రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్‌కు బాబాయి పవన్ కళ్యాణ్ బర్త్ డే గ్రీటింగ్స్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడని కితాబునిచ్చారు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయని… మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.