Sunday, November 24, 2024

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కలిసిన షర్మిల..

వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి వివాహం వచ్చే నెల (ఫిబ్రవరి) 17న జరగనుంది. ఈ సందర్భంగా తన అన్నయ్య ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులకు శుభలేఖని అందజేశారు వైఎస్ షర్మిల. ఇక, తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా పెళ్లి పత్రికని అందజేశారు షర్మిల.

హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్‌కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న షర్మిల.. కుమారుడి రాజారెడ్డి పెళ్లికి పవన్‌కళ్యాణ్‌ను ఆహ్వానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక రేపు సాయంత్రం (జనవరి 18) హైదరాబాద్‌లో వైఎస్‌ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజారెడ్డి మేనమామ, సీఎం జగన్‌ హాజరుకానున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement