అమరావతి: గ్రామాల్లో జనసేన బలంగా ఉందనేందుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు.
‘జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైంది. అధికార పార్టీ ఒత్తిళ్లు… బెదిరింపులు తట్టుకొని నిలిచారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అధికార పార్టీవాళ్ళు భయపడుతున్నారు. తొలి, రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపించాలి. మొదటి విడతలో 18 శాతానికి పైగా ఓట్లు వస్తే… రెండో విడతలో అది 22 శాతం దాటింది. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు. వాలంటీర్ల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వాళ్లతో రకరకాల బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా కిడ్నాప్ చేయిస్తున్నారు. జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారు?’ అంటూ ట్విట్ ద్వారా ప్రభుత్వాన్ని పవన్‌కల్యాణ్ నిలదీశారు.
గెలుపు దిశలో జనసేన.. గ్రామాల్లో బలంగా ఉందన్నపవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement