Thursday, September 12, 2024

Karnataka సిఎం సిద్ధ‌రామ‌య్య‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ బేటి

నేడు బెంగుళూరు వెళ్లిన ఉప ముఖ్య‌మంత్రి
క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రితో సమావేశం
అప్యాయంగా ప‌ల‌క‌రించిన సిద్ద‌రామ‌య్య‌
రాజ‌కీయాల‌పై మాటామంతి
ఏనుగుల బెడ‌ద‌పై ప‌వ‌న్ చ‌ర్చ‌లు
కుంకీ ఏనుగులను ఎపికి పంపాల‌ని అభ్య‌ర్ధ‌న

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ బెంగ‌ళూరు – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఎపిలోని పార్వ‌తీ పురం, చిత్తూరు జిల్లాలో గ్రామాల‌లోకి ప్ర‌వేశిస్తున్న చొర‌బ‌డుతున్న ఏనుగులను ఆరిక‌ట్టే చ‌ర్య‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ నేడు ఆ రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రితో చ‌ర్చ‌ల కోసం నేడు అమ‌రావ‌తి నుంచి బెంగుళూరు వెళ్లారు.. ముందుగా ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామయ్య నివాసానికి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. అక్క‌డికి చేరుకున్న ప‌వ‌న్ ను ఆప్యాయంగా లొనికి ఆహ్వ‌నించారు సిద్ద‌రామ‌య్య‌.. ఇరువురు కొంత సేపు రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు.. అనంత‌రం ఏనుగులు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు ప‌వ‌న్.. దీనిపై అట‌వీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖంద్రేతో చ‌ర్చించ‌ల‌సిందిగా కోరారు…

- Advertisement -

అనంత‌రం ప‌వ‌న్ మంత్రి ఈశ్వ‌ర్ తో భేటి అయ్యారు. చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయ‌ని, అలాగే, స్థానికులకు ఏనుగులు ప్రాణ హాని కలిగిస్తున్నాయి మంత్రి దృష్టికి తెచ్చారు.. ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయ‌న్నారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉండడంతో కొన్నింటిని త‌మ‌ రాష్ట్రానికి పంపాల‌ని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని పవన్ కల్యాణ్ కోరారు.
కుంకి ఏనుగుల మనుగడతో పాటు వాటి జీవన విధానంలో మార్పుపై పవన్ కూడా ఆయ‌న‌తో చ‌ర్చించారు. అలాగే, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించుకునే అంశంపై కూడా పవన్ కల్యాణ్ సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.. ఇరు రాష్ట్రాలు అక్ర‌మ ర‌వాణ వివ‌రాల‌ను, వాటిని స్మ‌గ్లింగ్ చేసే వారి స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల‌ని నిర్ణ‌యించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement