జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దే ఫిజియోథెరఫీ, నర్సింగ్ సేవలు, ట్రీట్మెంట్ తరువాత చేసే వైద్య సేవలు చేయనుంది ఈ హెల్త్ ఆన్ అజ్ సంస్థ అని అన్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, డాక్టర్స్‌ని ఇంటికి తెస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని చెప్పారు. ‘హెల్త్ ఆన్ అస్’ యాప్ వెనుక ఎంతో కృషి ఉందని.. ఇలాంటివి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని.. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్‌ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాన్ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement