రాజకీయాలకు పవన్ కల్యాణ్ తగినవాడని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.. నేడు హైదరాబాద్ లోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు అనుకువన్నీ చేశానని చెప్పారు. తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది ఎన్ సీసీ అని తెలిపారు. కాలేజీలో వేసిన నాటకంతో సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. అప్పటినుంచి, అనుకున్నదాని అంతు చూడడం నేర్చుకున్నానని వివరించారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని చిరంజీవి వెల్లడించారు. ఏదో ఒకనాడు పవన్ కల్యాణ్ ను ఉన్నతస్థాయిలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాజకీయాల్లో మాటలు పడాల్సి ఉంటుందని, ఒక్కోసారి మనం కూడా మాటలు అనాల్సి ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. మొరటుగా, కటువుగా లేకపోతే రాజకీయాల్లో రాణించలేరని, ఓ దశలో నాకు రాజకీయాలు అవసరమా అనిపించిందని చిరంజీవి తెలిపారు.
రాజకీయాలకు పవన్ కల్యాణ్ తగినవాడే.. అనుకున్న దాని అంతు చూస్తా.. నటుడు చిరంజీవి
Advertisement
తాజా వార్తలు
Advertisement