పవన్ కళ్యాణ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ఒకటి. అప్పట్లో వరుస పరాజయాల్లో ఉన్న పవన్‌కు ఈ సినిమా ఊపిరి పోసింది. అంతేకాదు ఎన్నో రికార్డులను కూడా సాధించిపెట్టింది. ఈ సినిమా నేటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. గబ్బర్ సింగ్ కంటే ముందు దాదాపు 10 ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్‌కు వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ‘ఖుషి’ తర్వాత ఆ స్థాయి హిట్ లేదు. మధ్యలో ‘జల్సా’ వచ్చినా ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా కిక్ ఇవ్వలేదు. అయితే ‘గబ్బర్ సింగ్’ అభిమానుల దాహం తీర్చి కెవ్వు కేక అనిపించింది.
దర్శకుడు హరీష్ శంకర్.. హిందీలో సక్సెస్ సాధించిన‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగిన విధంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు ఘనవిజయం సాధించాడు. పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ‘గబ్బర్ సింగ్’ సినిమాను నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో అన్ని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఈ మూవీ 306 కేంద్రాల్లో 50 రోజులు, 65 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచి పవన్‌కు సరికొత్త రికార్డులను అందించింది.