జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల పై నిప్పులు చెరిగారు. బిజెపి తరఫున తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. వైసిపి నాయకులు కొంతమంది వాళ్ళ అబ్బసొత్తులా సంపదను దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను సినిమా లో కోట్లు సంపాదిస్తాను, అలాగే కోట్ల రూపాయల టాక్స్ లు కడతాను. అంతేకాకుండా ప్రజలకు సహాయం కూడా చేస్తాను అని అన్నారు. పులివెందుల పేరు చెప్పగానే రౌడీయిజం అందరికీ గుర్తుకు వస్తుందని కానీ రాయలసీమ గడ్డ ఎంతో మంది మహనీయులు జన్మించారని అన్నారు.
ఈ రౌడీయిజానికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని జనసైనికులు అంతకన్నా కాదు అని ఆయన అన్నారు. మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యేల లేక గుండాల అంటూ విమర్శించారు. అవసరమైతే నా తల తెగి పడాలి తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి పడదని హెచ్చరించారు. ఎన్నికలొస్తే ప్రజలంతా ఎందుకు భయపడుతున్నారు? ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా ? మీ పౌరుషం ఏమైంది ? అంటూ ప్రశ్నించారు.
ఓటుకు 2000,5000 ఇస్తున్న వైసీపీ నేతలకు డబ్బు ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు నేను చాలెంజ్ చేస్తున్నాను. గొడవకు నాతో రండి సామాన్య ప్రజల పై మీ ప్రతాపం ఏంటి అంటూ నిలదీశారు. తిరుపతిలో లో మా అత్త రత్నప్రభ గెలవాలని కోరుకుంటున్నాను. ఆమె గెలుపుతో తిరుపతిలో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు.