Tuesday, November 19, 2024

AP | మ‌హిళ‌ల మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు.. అభినందించిన పవన్ !

ఏపీలో మహిళలు, బాలికలు అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేధిక‌గా ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారుగా 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని… ఇంత జరిగినా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

అయితే ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయ‌న్నారు. పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ఎన్డీఏ కూటమి ముందే చెప్పిందంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు అనే వార్తను పోస్ట్ చేస్తూ ఈ సందర్భంగా హోంమంత్రి అనిత నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులను, హోంశాఖను పవన్ కల్యాణ్ అభినందించారు.

మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు గానూ పోలీసులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా, మరింత భద్రంగా మార్చడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement