మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరమని అన్నారు ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించిన నేతలలో ఆయనోకరని గుర్తు చేశారు… వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశానని, ఈ సందర్భంగానే తన రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుని జనసేన పార్టీ ఎదుగుదలను ఆకాంక్షించారన్నారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని సంతాప ప్రకటనలో పవన్ పేర్కొన్నారు. . శ్రీనివాస్ గారి కుమారుడు, లోక్ సభ సభ్యుడు ధర్మపురి తో పాటు వారి ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement