ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా నిరసనల బాట పట్టారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రభుత్వం పై ప్రతిపక్షాలు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గళం విప్పారు. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్‌ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ వీడియో విడుదల చేశారు పవన్ కల్యాణ్.
రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారు.. కానీ, ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు వీడియోలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ కలచివేస్తోందన్న ఆయన.. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 30 లక్షల మంది సపోర్టు కారణం అన్నారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 10 వేల ఉద్యోగాలతో.. జాబ్ క్యాలెండర్‌లో పెట్టారని.. ఇది నిరుద్యోగులను నయవంచన చేయటమేనని మండిపడ్డారు.. ఇక, పోలీసు శాఖలో వేల పోస్టులు ఉంటే జాబ్ క్యాలెండర్‌లో వందల పోస్టులే పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. డీఎస్సీ ఊసే లేదన్నారు.. నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుంది, రేపు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని.. జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి : పెళ్లి కాని ఆడపిల్లల కోసం ‘ఆటా-సాటా’ అనే వింత సంప్రదాయం