హైదరాబాద్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తెలంగాణ కెబినెట్లోకి తీసుకోనున్నారు. ఈటల రాజేందర్ స్థానంలో ఖాళీ అయిన బెర్త్‌ను ఇప్పటి వరకు అలాగే ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు.
ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి తాండూరు నుండి పోటీ చేయాలనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వడం తో పట్నం కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు . దీంతో గురువారం మధ్యాహ్నం గం.3కు రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై. మంత్రిగా పట్నంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు