Tuesday, November 12, 2024

Patna High Court : సంచలన తీర్పు… 65శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు

రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 65శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇటీవల బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. దీనిపై అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన బీహార్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.

దీంతో పలువురు పిటిషనర్లు బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు రిజర్వేషన్లను 65శాతానికి పెంచడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ నిర్ణయం ఆర్టికల్ 14, 15, 16 ను ఉల్లంఘిస్తోందని కోర్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement